ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

2028 దాక ఎందుకు ఇప్పుడే తేల్చుకుందాం...



 


మొక్కజొన్న కొనుగోళ్లతోనే మీ వైఫల్యం బయటపడింది

ప్రజల్లో తిరగనీయకపోవడానికి మీరెవరు

ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయండి

నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ లో ఒరిజినల్ ఎవరో చెప్పగలరా?

పాలేరును సస్యశ్యామలం చేసిన చరిత్ర బి ఆర్ ఎస్ ది

బిఆర్ఎస్ జిల్లా నాయకుడు బెల్లం వేణు

ప్రజాపక్షం/ఖమ్మం : 2028 దాకా ఎందుకు, ఇప్పుడే మీ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వస్తే మా అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డిపై పోటీ చేసి ప్రజల ముందే తేల్చుకుందామని బిఆర్ఎస్ జిల్లా నాయకుడు బెల్లం వేణు అన్నారు.బుధవారం ఖమ్మం నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాలేరు నియోజకవర్గంలో చెక్ డ్యాములు నిర్మించి వ్యవసాయానికి ఊతమిస్తూ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన చరిత్ర బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అయితే రెండున్నర సంవత్సరాల ప్రస్తుత పాలనలో ప్రజలకు చెప్పుకునే స్థాయి అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. ముఖ్యంగా పాలేరులో మొక్కజొన్న కొనుగోళ్ల వ్యవహారంతోనే ప్రభుత్వ పనితీరు బయటపడిందని ఆరోపించారు.ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగించాల్సింది పోయి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. మాట్లాడితే కేసీఆర్–కేటీఆర్ పేర్లు ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం కంటే ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాలని సూచించారు.మా నాయకుడు కందాల ఉపేందర్ రెడ్డి ప్రతిరోజూ గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలుతెలుసుకుంటున్నారని, ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. మీ వైఫల్యాలను ప్రశ్నించినందుకే తాత మధు పై వ్యక్తిగత విమర్శలు చేయడం అనైతికం అన్నారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే 50 సంవత్సరాల క్రితం తాతా మధుకు ఉన్న ఆస్తి ఎంత పొంగులేటి రాఘవరెడ్డికి ఉన్న ఆస్తి ఎంత అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వేల కోట్లు ఎలా వచ్చాయన్నారు. పార్టీల ఫిరాయింపు అని మాట్లాడుతున్నారని అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తున్న వారు నిజమైన కాంగ్రెస్ వారేనా అన్నారు.   ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.అలాగే పాలేరు నియోజకవర్గంలో పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేవని, అధికారులు తటస్థంగా వ్యవహరించాలని కోరారు. ప్రజలు మీకు ఇచ్చిన ఆశీర్వాదం మేరకు రెండున్నర సంవత్సరాలలో మేము ఎక్కడా కూడా మాట్లాడలేదన్నారు. కానీ ఇకనుంచి ప్రజా సమస్యలపై పాలేరు అభివృద్ధిపై బి ఆర్ఎస్ గళం ఎత్తుతుంది అన్నారు. ఈ క్రమంలో ఒత్తిళ్లు, బెదిరింపులు, కేసులకు భయపడేది లేదని, ప్రజా సమస్యలపైఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటామని  స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది