ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లాలో పరిపాలనా సేవలను మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాకు మొత్తం నాలుగు తహసీల్దార్ కార్యాలయాలు మంజూరు చేయగా, తిరుమలాయపాలెం, మధిర, కారేపల్లి, ముదిగొండ మండల తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి ఒక్కో కార్యాలయానికి రూ. 2.25 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు.ఈ నూతన భవనాలను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలు, అత్యాధునిక హంగులతో నిర్మించనున్నారు.ఈ కార్యాలయాల నిర్మాణం పూర్తయితే ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత వేగంగా, సౌకర్యవంతంగా అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఖమ్మం జిల్లాకు నాలుగు నూతన తహసీల్దార్ కార్యాలయాలు – ఒక్కో భవనానికి రూ.2.25 కోట్ల నిధులు
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి