ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

AVR వెంచర్‌లో అభివృద్ధి పనులు – నీటి సమస్య పరిష్కారానికి కొత్త బోరు ఏర్పాటు

 

                

   ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చిన్న వెంకటగిరి 9వ వార్డు AVR వెంచర్‌లో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.ఏదులాపురం మున్సిపాలిటీ 32 వార్డుల అభివృద్ధి కోసం రూ.75 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయించిన నేపథ్యంలో, AVR వెంచర్‌లో నెలకొన్న నీటి ఎద్దడి మరియు సైడ్ డ్రైన్ సమస్యలను స్థానికులు కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాధ బాబు, పొంగులేటి కార్యాలయం ఇన్‌చార్జి తంబూరి దయాకరరెడ్డి ప్రత్యేక చొరవతో గురువారం నూతనంగా బోరు వేయించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి కి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కందుకూరి వెంకటనారాయణ, సంగాని వెంకటేష్, నజరుద్దీన్, నెమలి వెంకటేశ్వర్లు, సుధాకర్ రెడ్డి, పంబ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది