![]() |
| చిత్రం : ప్రజాపక్షం ఫోటోగ్రాఫర్ అంజి |
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం నగరానికి తలమానికంగా రూపుదిద్దుకుంటున్న కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణీయంగా కనిపించింది. అప్పటివరకు ఎండ తీవ్రతతో వేడెక్కిన వాతావరణం ఒక్కసారిగా మారి, ఆకాశమంతా కారు మేఘాలు కమ్ముకోవడంతో ప్రాంతం మొత్తం ఆహ్లాదకరంగా మారింది. నిర్మాణ దశలో ఉన్న కేబుల్ బ్రిడ్జి వెనుకన నల్లటి మేఘాలు ఆవరించడం, మధ్య మధ్యలో మెరుపులు మెరుస్తూ కనిపించడం, దూరంగా వినిపించిన ఉరుములు ఆ దృశ్యానికి మరింత అందాన్ని చేకూర్చాయి. వర్షం రానున్న సంకేతాలతో ఆకాశం ఒక్కసారిగా రూపు మార్చుకోవడంతో అక్కడికి వచ్చిన ప్రజలు ఆ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఎండాకాలపు వాతావరణం నుంచి ఒక్కసారిగా వర్షాకాలపు చల్లదనాన్ని తీసుకొచ్చిన ఈ కారు మేఘాలు కేబుల్ బ్రిడ్జి అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. నగర అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తున్న ఈ నిర్మాణం, ప్రకృతి అందాలతో కలిసిపోవడంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రకృతి ఆధునిక నిర్మాణం కలయికగా కనిపించిన ఈ దృశ్యం ప్రజలకు ప్రత్యేక అనుభూతిని మిగిల్చింది.
|
|

కామెంట్‌ను పోస్ట్ చేయండి