పూర్తికి నిర్థిష్ట గడుపు ప్రకటించాలి రైతు బరోసా సంపూర్ణంగా అందిస్తారా?
హామీల అమలుకు కృషి చేయండి మీడియా సమావేశంలో సి.పి.ఐ నేత బాగం
ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలు
ప్రజాపక్షం/ఖమ్మం : సంపూర్ణంగా పూర్తిచేయక పోవడంతో రైతుల్లో ప్రభుత్వం పట్ల విశ్వనీయత సన్నగిల్లుతున్నదని సి.పి.ఐ నేత తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు భాగం హేమంతరావు తెలిపారు. రైతుల్లో ఉన్న అసంతృప్తి అగ్రహంగా మారక ముందే రైతులకు సంబంధించిన పథకాలను పూర్తిచేయకపోవడంతోపాటు ఖమ్మం జిల్లాలో అతి పెద్ద జనవరులుగా వున్న సీతారామ ప్రాజెక్టు ఎప్పటి లోగా పూర్తిచేస్తారో రైతు ఆశిర్వాద సభ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సి.పి.ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడీయా సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ సి.పి.ఐ గోదావరి నీటిని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు అందించాలని అనేక చారిత్రక సమరశీల పోరాటాలను నిర్వహించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా దుమ్ముగూడెం ప్రాజెక్టు ప్రారంభమైందని, ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తరువాత అది సీతారామ ప్రాజెక్టుగా రూపాంతరం చెందిందన్నారు. రూ.11300 కోట్ల అంచనాలతో ప్రారంభమైన సీతారామ అంచెలంచలుగా పెరిగి నిర్మాణం వ్యయం 19365 కోట్లకు చేరిందని ప్రభుత్వాలు మారుతున్నాయని సీతారామ పూర్తికావడం లేదన్నారు. కొన్ని ఫ్యాకేజీలలో పనులు ఇంకా ప్రారంభం కాలేదని పంటకాలువల త్రవ్వకాలకు ఇటీవలే టెండర్లు పూర్తిచేశారని హేమంతరావు తెలిపారు. కాంగ్రెస్ మూడు బడ్జెట్లలతో కలిపి రూ.1000 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. పూర్తిస్థాయిలో బడ్జెట్‌ను కేటాయించి కాలయాపన లేకుండా సీతారామాను పూర్తి చేసి ఏదు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని సి.పి.ఐ ఖమ్మం జిల్లా సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. లింక్ కెనాల్‌పై ఉన్న శ్రద్ద సీతారామాపై స్థానిక మంత్రులకు లేదన్నారు. రైతు బరోసా రైతు రుణమాఫీ పంటల బీమా విషయంలో ఈ ప్రభత్వం మాట తప్పడంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉందన్నారు. రుణమాఫీకి సంబంధించి విడుదల చేసి జి.ఓలో 2 లక్షల రుణం పైపడిన రైతుల రుణాలు సైతం మాఫీ చేస్తామని చెప్పారని ఎందుకు చేయలేదోఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రైతు బరోసా ఇప్పటికే రెండు సార్లు పూర్తిగా ఎగవేసి గత రబీలో రెండు ఎకరాలతో సరిపుచ్చారన్నారు. ఆశీర్వాద సభలో రైతు బరోసా అర్హత కలిగిన రైతులందరికీ పూర్తిస్తాయిలో అందిస్తేనే అది ఆశీర్వాద సభ అవుతుందని హేమంతరావు తెలిపారు. ఐరోసాపై స్పష్టత ఇవ్వనిఈ ప్రభుత్వం ఇప్పడైన పూర్తి స్థాయిలో ఇస్తుందా అనే అనుమానం వస్తుందని దేవుళ్ళపై ప్రమాణం చేసి ఈ హామీలైన పూర్తిస్థాయిలో అమలు పర్చాలన్నారు. ఏ రాష్ట్రంలోను పంటల బీమా లేకుండా లేదని, పంటల బీమీ పథకాన్ని తక్షణం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి