ప్రజాపక్షం/ చింతకాని : ఈ నెల 30న చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ నేపథ్యంలో ప్రజలు సురక్షితంగా సభా ప్రాంగణానికి చేరుకునేందుకు ప్రత్యేక ట్రాఫిక్, పార్కింగ్ సూచనలు విడుదల చేసినట్లు వైరా ఏసీపీ సారంగపాణి తెలిపారు.సభకు వచ్చే ప్రజలు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ, తమకు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలిపి సభకు చేరుకోవాలని సూచించారు.
మార్గాలు – పార్కింగ్ వివరాలు:
➡️ పాలేరు నియోజకవర్గం 4 మండలాలు, ముదిగొండ మండలం
వెంకటగిరి ఎక్స్ రోడ్ → థంసలాపురం → పందిళ్లపల్లి
పార్కింగ్: 1 నుంచి 5 వరకు
➡️ కారేపల్లి, కామేపల్లి మండలాలు
ఖమ్మం టౌన్ → ముస్తఫా నగర్ → పందిళ్లపల్లి
పార్కింగ్: 1 నుంచి 5 వరకు
➡️ సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూర్, కల్లూరు మండలాలు
కల్లూరు → గ్రీన్ ఫీల్డ్ హైవే → కోదుమూరు → చింతకాని
పార్కింగ్: 7, 8, 15
➡️ వైరా, కొనిజర్ల మండలాలు
బస్వాపురం → పెద్ద గోపతి → నేరేడ → చింతకాని
పార్కింగ్: 7, 8, 15
➡️ ఏన్కూరు, తల్లాడ మండలాలు
వి. వెంకటాయపాలెం → వందనం → చింతకాని
పార్కింగ్: 7, 8, 15
➡️ ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, చింతకాని మండలాలు
బోనకల్లు → నాగలంచ మార్గం
పార్కింగ్: 10, 11, 12, 13, 14
➡️ మత్కేపల్లి – నామవరం వైపు ఉన్న ముదిగొండ మండల గ్రామాలు
మత్కేపల్లి క్రాస్ రోడ్ → పందిళ్లపల్లి
పార్కింగ్: 1 నుంచి 5 వరకు
ప్రజలు నిర్ణయించిన మార్గాల ద్వారానే సభా ప్రాంగణానికి చేరుకొని ట్రాఫిక్ నిర్వహణకు సహకరించాలని వైరా ఏసీపీ కోరారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి