ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన మంత్రి పొంగులేటి కి ఘన స్వాగతం


 మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ యువజన నాయకుడు ఏనుగు మహేష్ బృందం

ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: విదేశీ పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఎదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు గురువారం తెల్లవారుజామున మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ యువజన నాయకుడు ఏనుగు మహేష్ బృందం మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు మహేష్, కాటం సంపత్, దొడ్డి మధు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది