ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పిండిపోలు గ్రామంలో దారుణం..


వృద్ధురాలిని హత్య చేసి బంగారం దోచుకెళ్లిన దుండగులు

ప్రజాపక్షం / తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలం పిండిపోలు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి ఓ వృద్ధురాలిని హత్య చేసి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించారు.గ్రామానికి చెందిన చెన్న జనార్ధన్ భార్య సుగుణమ్మ (వృద్ధురాలు)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం వృద్ధ దంపతులు మాత్రమే పిండిపోలు గ్రామంలోని తమ నివాసంలో ఉంటున్నారు.శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు సుగుణమ్మను హత్య చేసి, ఆమె మెడలో ఉన్న బంగారు నగలను తీసుకుని పరారయ్యారు. ఘటన సమయంలో భర్త కోటేశ్వరరావు ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆయనకు కంటి చూపు లేకపోవడంతో దుండగుల కదలికలను గుర్తించలేకపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, దుండగుల ఆచూకీపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.ఈ ఘటనతో పిండిపోలు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొనగా, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. నిందితులను త్వరితగతిన అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది