ఖమ్మం జిల్లా పై వరాల జల్లు కురిసేన...
ముఖ్యమంత్రి ప్రసంగం పైనే అందరి చూపు,....
ప్రజాపక్షం/ఖమ్మం : ముఖ్యమంత్రిగా రైతు ఆశీర్వాద సభలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న మీకు స్వాగత సుమాంజలి. ఖమ్మం జిల్లా వ్యవసాయమే ప్రధానంగా కలిగిన జిల్లా. ఈ జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరి లో రెండున్నర లక్షల ఎకరాలు సాగవుతుండగా పాలేరు, వైరా, లంకా సాగర్ మొదలైన మధ్యతరహా నీటి ప్రాజెక్టుల ద్వారా 60వేల ఎకరాలు సాగవుతున్నాయి. చెరువులు, కుంటలతో పాటు వైరా, కట్టలేరు, మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. కానీ ఇవి గత కొంత కాలంగా పలు రకాల సమస్యలతో పని చేయడం లేదు. జిల్లా ను సస్యశ్యామలం చేయడంతో పాటు పైన పేర్కొన్న నీటి వనరుల సరిధిలోని ఆయకట్టును స్థిరీకరించేందుకు సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే పరిష్కార మార్గం. కృష్ణా నది కి నీటి లభ్యత ఆధారంగా నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరు అందుతుంది. సీతారామ ద్వారా పాలేరులో గోదావరి జలాలను కలిపినట్లయితే ఖమ్మం జిల్లాలో మొత్తం ఆయకట్టు స్థిరీకరణ జరగడంతో పాటు యాతా కుంట టన్నెల్ ద్వారా సత్తుపల్లి ప్రాంతానికి కూడా సాగునీరు అందుతుంది. సీతారామ ప్రాజెక్టుకు సంబం ధించి అంచనాలు పెరుగుతుండటం, కేటాయింపులు ప్రతి యేటా క్రమేపి తగ్గుతుండటం మమ్మల్ని కలవర రుస్తుంది. ఇప్పటికే ప్రాజెక్టు అంచనా కంటే తొమ్మిది వేల కోట్లు పెరిగింది. జాప్యం జరిగే కొద్ది అంచనాలు పెరుగుతుంటాయి. సత్వరం సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సరిపడ నిధులు కేటాయిస్తూ రైతు ఆశీర్వాద సభలో ప్రకటన చేయాల్సిందిగా కోరుతున్నాం. దశాబ్ద కాలంగా అతివృష్టో, అనావృష్టో, తెగుళ్లు, వ్యవ సాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పంటల బీమా లేకపోవడంతో ఆరుగాలం కష్టపడి పెట్టు డులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వం పలు రకాల కారణాలతో పంటల బీమాను ఎత్తివేసింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పంటల బీమాను అమలు చేస్తామని చెప్పిన విషయం విధి కమే. ఈ ఏడాది నుంచైనా పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టేవిధంగా రైతు ఆశీర్వాద సభలో ప్రకటన చేస్తారని కోరుతున్నాం. జిల్లాల విభజన తర్వాత భద్రాద్రి కొత్తగూడెంకు పరిశ్రమలు తరలిపోవడంతో ఖమ్మం ఖిల్లాలో గ్రానైట్ మినహా మరే పరిశ్రమ లేదు. ఉపాధి ఉద్యోగాల కల్పనకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను లకొల్పేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లక్షన్నర మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన గ్రానైట్ పరిశ్రమకు రాయితీలను ప్రకటించి ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.హైదరాబాద్,వరంగల్ కు దీటుగా ఖమ్మం జిల్లాలో విద్యా వ్యవస్థ విస్తరించింది. పలు విద్యా సంస్థలు ఇక్కడ నెలకొల్పడంతో చుట్టు పక్కల జిల్లాలకు విద్యా కేంద్రంగా ఖమ్మం భాసిల్లుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లో ఖమ్మం మినహా ప్రతి జిల్లాలోనూ విశ్వ విద్యాలయాల స్థాపన జరిగింది. చైతన్యవంతమైన ప్రాంతంగా విద్యా నలోనూ, విద్యా సంస్థలు నెలకొల్పడంలోనూ ముందున్న ఖమ్మం జిల్లాలో విశ్వ విద్యాలయాన్ని నెలకొల్పా అని అనేక ఆందోళనలు జరిగాయి. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కూడా అనేక విజ్ఞప్తులు అందజేయడం జరిగింది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం.భూ హక్కులకు సంబంధించి గత ప్రభుత్వం ధరణి పథకాన్ని తీసుకు వచ్చింది. ఖమ్మం కిల్లాలో అనేక మంది రైతులు ధరణి పథకం ద్వారా తమ భూములు రికార్డులోకి నమోదు కాక పలు ఇబ్బం లను ఎదుర్కొన్నారు. ఇప్పటికీ వేల ఎకరాలు రికార్డుల్లో నమోదు కాలేదు. తమరి ప్రభుత్వం ధరణి స్థానే భూ భారతిని తీసుకు వచ్చింది. భూ భారతిలో ప్రతి భూ సమస్యలకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దునే ఉన్నప్పటికీ ఇటీవల వరకు భూ క్రయ, విక్రయాలు సాదా బైనామాల ద్వారానే జరిగేవి. ఇప్పటికీ ఈ సమస్య తీవ్రంగానే ఉంది. భూ భారతి ద్వారా సాదాబైనామాల సమస్య పరి స్కరించి భూ హక్కులు కల్పించాల్సిందిగా కోరుతున్నాం. సర్వే నెంబర్లలో తప్పులు, హక్కు ఒక చోట సాగు మరో చోట కలిగిన అనేక సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుతున్నాం. ఖమ్మంజిల్లాలో పోడు సమస్య కూడా పలు మండలాల్లో ఉంది. ఉమ్మడి ఖమ్మం ఎమ్మం జిల్లాలో ఏజెన్సీ పరిధిలోని అనగా 1/70 పరిధిలోని గిరి జన, గిరిజనేతరులకు ఇబ్బందులు కలగని రీతిలో సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివాస స్థలాల సమస్య ప్రధానంగా ఉంది. హైదరాబాద్ నగరం తర్వాత ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించిన నేపథ్యంలో నివాస స్థలాలకు విపరీతమైన ధరలు పెరగడంతో పేదలు నివాస స్థలాలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం నివాస స్థలాల సంపిణీపై దృష్టి సారించని విషయం మీకు విధితమే. అర్హులైన పేదలను గుర్తించి నివాస స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం.ఉద్యోగ, ఉపాధి రంగాలపైన దృష్టి సారిం వాల్సి ఉంది. వీటితో పాటు అక్షరాస్యత ఎక్కువగా ఉండి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్న ఖమ్మం జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యల పరిష్కారంతో పాటు పింఛన్‌దారులకు సంబంధించి కాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రైతు ఆశీర్వాద సభ తర్వాత ఎరువులను అందుబాటులో ఉంచడంతో పాటు మారిన వాతావరణ పరిస్థితులు ఎలినినో ప్రభావం నేపథ్యంలో తక్కువ ఏటి ఖర్చుతో లాభసాటి పంటల వైపు రైతాంగం మళ్లేలా నిరంతర అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం.
ఇట్లు
ఖమ్మం జిల్లా ప్రజలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి