ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పేదలకు అండగా సీపీఐ.. ఇద్దరు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ



 ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే ముఖ్యమంత్రి సహాయనిధి నిజమైన అండగా నిలుస్తోందని, ఆ సహాయం అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా సీపీఐ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండల పరిధిలోని ఏదులాపురం , వరంగల్ క్రాస్ రోడ్ ప్రాంతాల్లో ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.ఏదులాపురం గ్రామానికి చెందిన ఘనపారపు కొమరయ్యకు రూ.57,500, వరంగల్ క్రాస్ రోడ్‌కు చెందిన బానోతు అమర్ సింగ్‌కు రూ.60,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ సహకారంతో, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిఫారసు మేరకు మంజూరైనట్లు నాయకులు తెలిపారు.చెక్కులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా అందజేసిన నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా సీపీఐ పార్టీ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కౌన్సిలర్ దండి రంగారావు, మామిడి సుదర్శన్ రెడ్డి, వెన్నం భాస్కర్, ఘనపారపు నాగయ్య, ఘనపారపు వీరబాబు, వెంపటి సురేందర్, వెంపటి రాము, కరుణాచారి, ఏబు, చింతల ఉదయ్ కుమార్, సమీర్, మాత కృపాకర్, బియ్యాల రాజు తదితర సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది