ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ప్రజాపక్షం కథనానికి స్పందన.. చెరువు ఆక్రమణపై ఐబీ అధికారుల పరిశీలన



  మంగళగూడెం చెరువులో ఆక్రమణ జరిగినట్లు ప్రాథమిక గుర్తింపు

రెవెన్యూ–ఐబీ సంయుక్త సర్వేకు నిర్ణయం.. పోలీసులకు ఫిర్యాదుకు సన్నాహాలు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని మంగళగూడెం గ్రామంలో పాండవులకుంట చెరువు ఆక్రమణపై ప్రజాపక్షం దినపత్రికలో "కాల్వను మింగి.. కట్టను కూల్చి.." శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. ఈ నేపథ్యంలో ఐబీ (నీటిపారుదల శాఖ) అధికారులు గురువారం ఘటనా స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.ఐబీ డీఈ రాజేష్, స్థానిక ఏఈతో కలిసి చెరువు పరిసరాలను పరిశీలించి, చెరువు భూమిలో ఆక్రమణ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి వివరాలు నిర్ధారించేందుకు రెవెన్యూ శాఖతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.అదే విధంగా, సర్వే నిర్వహణ కోసం రెవెన్యూ శాఖకు అధికారికంగా లేఖ పంపనున్నట్లు వెల్లడించారు. చెరువు ఆక్రమణకు సంబంధించిన ఆధారాలతో పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి కథనాన్ని ప్రచురించిన ప్రజాపక్షం దినపత్రికకు మంగళగూడెం గ్రామ రైతులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. చెరువును పూర్తిస్థాయిలో ఆక్రమణల నుంచి విముక్తి కల్పించి ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించాలని వారు అధికారులను కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది