నలంద విజయం నేటి యువతకు ఆదర్శం సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్
సిపిఐ నాయకుల ఘన సన్మానం
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్:ఎదులాపురం మున్సిపాలిటీ 32వ వార్డుకు చెందిన కర్నే లక్ష్మయ్య, కర్నే ఎస్తేరు రాణి దంపతుల కుమార్తె కర్నే నలంద తన కృషి, పట్టుదలతో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించి కుటుంబంతో పాటు ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆదివారం సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ సాలధ్యంలో సిపిఐ కౌన్సిలర్లు, సిపిఐ నాయకులు ఆమెను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ...సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన నలంద విజయం నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు. లక్ష్యసాధనకు నిరంతర శ్రమ, పట్టుదలే విజయానికి మూలమని పేర్కొన్నారు. నలంద భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో ఐఏఎల్ జాతీయ సమితి సభ్యుడు ఓరుగంటి శేషగిరి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు చెరుకుపల్లి భాస్కర్, వెంపటి సురేందర్, 32, 30వ వార్డుల కౌన్సిలర్లు మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, దండి శ్రీజ, సిపిఐ మండల కార్యదర్శి పుచ్చకాయ సుధాకర్, సిపిఐ నాయకులు మామిడి సుదర్శన్ రెడ్డి, వెన్నం భాస్కర్, దొంతగాని వెంకన్న, ఉపాధ్యాయుడు ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి