ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

బేతుపల్లి రీ సర్వే పారదర్శకంగా నిర్వహించాలి


 

అధికారులకు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆదేశాలు

ప్రజాపక్షం / సత్తుపల్లి: మండల పరిదిలోని  బేతుపల్లి గ్రామంలో చేపట్టిన రీ సర్వే ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి రీ సర్వే పనులను పరిశీలించిన ఆయన, ప్రతి రైతుకు పూర్తి అవగాహన కల్పించి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని సూచించారు.గ్రామంలో పది ప్రత్యేక బృందాలతో రీ సర్వే చేపడుతున్నామని, ప్రతి బృందం రోజుకు 50 నుంచి 60 ఎకరాల వరకు సర్వే పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. రైతు వేదికలోనే డేటా ఎంట్రీ, డిజిటల్ మ్యాప్ తయారీ పనులు సమాంతరంగా కొనసాగించాలని ఆదేశించారు.ప్రభుత్వ భూములు, రహదారులు, చెరువులు, కాలువలు, ప్రజా స్థలాల వివరాలను కోఆర్డినేట్లతో నమోదు చేసి ఖచ్చితమైన భూ రికార్డులు సిద్ధం చేయాలని సూచించారు. రీ సర్వే వల్ల ఏ రైతు భూమి విస్తీర్ణం తగ్గదని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం, ఖచ్చితమైన రికార్డులే ఈ ప్రక్రియ లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి, తిరుమలాయపాలెం తహసీల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది