ఖమ్మం రూరల్ మండలం గోల్లపాడులో ఘటన
అన్ని దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని గోల్లపాడు గ్రామ ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో తూనీ కొలతల అధికారులు వినియోగదారులకు అందుతున్న తూనికపై బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు . జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి శ్రీలత ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో దుకాణంలో వినియోగిస్తున్న రెండు తూనిక పరికరాలను పరీక్షించగా కిలోకు పైగా వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.తూనిక పరికరాలు చట్టబద్ధ ప్రమాణాలకు అనుగుణంగా లేవని నిర్ధారించిన అధికారులు సంబంధిత రికార్డులను పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు సంబంధిత డీలర్‌పై తూనికలు, కొలతల చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.విచారణ అనంతరం నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి శ్రీలత తెలిపారు. ఈ ఘటనతో రేషన్ దుకాణాల్లో తూనికల వ్యవహారంపై అధికారులు మరింత విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి