ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి


 20 బెంచీలు అందించిన 29వ వార్డు కౌన్సిలర్ ఉమా–వెంకటేశ్వర్లు దంపతులను అభినందించిన తుంబూరు దయాకర్ రెడ్డి

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజాప్రతినిధులు, సేవాభావం కలిగిన వ్యక్తులు తోడ్పాటు అందించడం అభినందనీయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు.ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డు 29వ వార్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్  నాయకులు వెంపటి ఉమా–వెంకటేశ్వర్లు దంపతులు 20 బెంచీలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దయాకర్ రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తోడుగా ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విద్యార్థుల భవిష్యత్తు కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం 20 బెంచీలు అందించిన కౌన్సిలర్ ఉమా–వెంకటేశ్వర్లు దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. విద్య, వైద్యం, మౌలిక వసతులు, ప్రజా సంక్షేమ రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తోందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు సోము వెంకటరెడ్డి, దివ్య, కడవ నవీన్ ప్రసాద్, బుర్ర మహేష్, కాంగ్రెస్ నాయకులు నూకల రామ్మోహన్ రెడ్డి, కొట్టం శిరీష, రంజిత్ రెడ్డి, వెంపటి సురేష్, గణపారపు వీరన్న, పొన్నెకంటి నర్సింహారావు, మిల్లు ప్రసాద్ రావు, చారి, శేషి రెడ్డి, రాకేష్ రెడ్డి, సురేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, భుజంగరెడ్డి, ఉపేందర్ రెడ్డి, కొక్కు రాజు, రంజిత్ నాయక్, మేళ్లచెరువు సురేష్, వడ్లకుండ భుజంగరావు, వేర్పుల వీరయ్య, అట్టూరి వీరబాబు, వేర్పుల జయప్రసాద్ రావు, ఏపురి తరుణ్, బొడ్డు హర్షవర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది