ఏదులాపురంలో అప్పారావు ప్రథమ చికిత్స కేంద్రం ప్రారంభం
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్:ఏదులాపురం మున్సిపాలిటీ 28వ వార్డు పరిధిలో ప్రజలకు అత్యవసర సమయంలో ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అప్పారావు ప్రథమ చికిత్స కేంద్రాన్ని గురువారం 29వ వార్డు కౌన్సిలర్ వెంపటి ఉమా, వెంకటేశ్వర్లు శుభముహూర్తంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి అవసరమని అన్నారు. స్థానికులకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు అందించాలని కేంద్ర నిర్వాహకులకు సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం రాకేష్ రెడ్డి, శైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శైరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏపూరి తరుణ్, వడ్లకొండ భుజంగరావు, మేళ్లచెర్వు సురేష్, కాలనీ పెద్ద నంబూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి