ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఘనంగా దుస్సా జగదీశ్వర్ సంతాప సభ



  నివాళులర్పించిన మున్సిపాలిటీ టీచర్స్, పెన్షన్, వెల్ఫేర్ అసోసియేషన్

ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్ : ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయి ప్రభాత్ నగర్ కాలనీకి చెందిన మాజీ జిల్లా సైన్స్ అధికారి శ్రీ దుస్సా జగదీశ్వర్  సంతాప సభను ఎదులాపురం టీచర్స్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, దుస్సా జగదీశ్వర్ విద్యారంగ అభివృద్ధికి విశేష సేవలందించారని కొనియాడారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సైన్స్ విద్య అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అలాగే ఉపాధ్యాయ సంఘం TPTF అభివృద్ధిలోనూ ఆయన కీలక పాత్ర పోషించి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించారని గుర్తు చేశారు.అనంతరం దుస్సా జగదీశ్వర్  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల మౌనం పాటించి సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఉడుగు వెంకటేశ్వర్లు, అధ్యక్షులు ఎస్. విజయ్, కోశాధికారి మల్లయ్య, కార్యదర్శి వల్లే బోయిన వెంకటరమణ, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది