గ్రామీణ యువతకు సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలే లక్ష్యం: శ్రీరామోజీ ఉప్పలా చారి
ప్రజాపక్షం/ ఖమ్మం: గ్రామీణ ప్రాంతాల యువతను సాఫ్ట్వేర్ రంగంలో నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతూ పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన నిధి సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రైనింగ్ వ్యవస్థాపకుడు చైర్మన్ అండ్ పౌండర్ శ్రీ రామోజీ ఉప్పలా చారి మరో ముందడుగు వేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని టిటిడీసీ ఎదురుగా నూతన హంగులతో, ఆధునిక సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన నిధి సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రైనింగ్ సెంటర్లో ఆదివారం పూజా కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఎంతోమంది నిరుద్యోగులను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఉప్పలచారి మరో నూతన అధ్యాయానికి నాంది పలికారు. ఖమ్మంలో టీటీడీ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయనున్న సాఫ్ట్వేర్ ట్రైనింగ్ న్యూస్ ట్యూషన్ సెంటర్ పూజకార్యక్రమానికి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యాసంస్థల నిర్వాహకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీరామోజీ ఉప్పలా చారి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడేందుకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందిస్తూ ఇప్పటికే అనేక మందిని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడేలా చేశామని తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మరింత మెరుగైన శిక్షణ అందించి, భవిష్యత్తులో మరింత మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, సాఫ్ట్వేర్ నిపుణులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి