ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకు చెందిన మొహమ్మద్ రజబ్ అలీ కుమారుడు మహబూబ్ అలీ (37) దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు.మహబూబ్ అలీ మృతిచెందిన విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకుడు భూక్యా సురేష్ నాయక్, ఏదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ నాయకుడు నూకల రామ్మోహన్ రెడ్డి ఆయన నివాసానికి బుధవారం వెళ్లి పార్ధివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మహబూబ్ అలీ కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో కళ్లెం శేషిరెడ్డి, షాబాదు కరుణాకర్ రెడ్డి, భద్రాచారి తదితరులు పాల్గొని మహబూబ్ అలీకి నివాళులర్పించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి