ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

SIR ఎన్యూమరేషన్ ఫారంపై ఎదులపురం మున్సిపాలిటీలో విస్తృత అవగాహన సదస్సు


 


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు అమూల్యమైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావాలని లక్ష్యంగా చేసుకుని ఎదులపురం మున్సిపాలిటీ పరిధిలో SIR Enumeration Formపై విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు.తుంబురూ దయాకర్ రెడ్డి ఆదేశాలతో జొన్నలగడ్డ రవికుమార్, ఎదులపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాణోత్ కిషోర్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో SIR Enumeration Form ప్రాముఖ్యత, ఫారాన్ని ఎలా పూరించాలి, నమోదు చేయాల్సిన వివరాలు, అవసరమైన పత్రాలు, ప్రజలకు కలిగే సందేహాల నివృత్తి వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు.ప్రతి అర్హులైన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి ఈ సమాచారాన్ని చేరవేసి, ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని సూచించారు.ప్రతి ఓటు విలువైనది – ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండాలి" అనే సందేశంతో కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు, వెంపటి సురేష్, వెంపటి రవి, బాణోత్ హరి, కందుకూరి వెంకట నారాయణ, గొనె బుజంగా రెడ్డి పాల్గొన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది