ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

27వ వార్డులో మురుగునీటి సమస్య తీవ్రం.. వెంటనే పరిష్కరించాలని ప్రజల విజ్ఞప్తి


 అంగన్వాడీ కి వెళ్లే దారి కావడంతో చిన్నారుల అవస్థలు సైతం తీవ్రతరం

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో మురుగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. మున్సిపాలిటీ కార్యాలయం వెనుక ఉన్న అంగన్వాడికి వెళ్లే దారిలోని సీసీ రోడ్డుపై ఓ ఇంటి డ్రైనేజ్ పంపు ద్వారా మురుగునీటిని నేరుగా రోడ్డుపైకి విడుదల చేస్తుండటంతో రహదారి మొత్తం మురుగునీటితో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతోంది.స్థానికులు పలుమార్లు సంబంధిత ఇంటి యజమానికి ఈ విషయాన్ని తెలియజేసినా ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో మురుగునీరు రోడ్డుపై నిల్వ ఉండటంతో అంగన్వాడికి వెళ్లే చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై నడవడమే కష్టంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.మురుగునీరు నిల్వ ఉండటం వల్ల దోమల పెరుగుదల అధికమై డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిశీలించి రోడ్డుపైకి మురుగునీటిని విడుదల చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ అధికారులను స్థానికులు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది