కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన సిపిఐ కౌన్సిలర్ మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి
ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్ : ఎదులాపురం మున్సిపాలిటీ 32వ వార్డు పరిధిలోని వెంపటి నగర్ లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను 32వ వార్డు కౌన్సిలర్ మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి సోమవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా, మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ 32వ వార్డు కార్యదర్శి మామిడి సుధర్శన్ రెడ్డి, AIYF జిల్లా ఉపాధ్యక్షులు మామిడాల కిరణ్, యువజన సంఘం నాయకులు దండి రవి,రామిడి అజయ్ రెడ్డి పాల్గొన్నారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో వెంపటి నగర్ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ, పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి