ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

అడవి జంతువుల కోసం ఉచ్చు... అటవీ శాఖ అధికారి బలి

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాజీ ఎంపీపీ కుమారుడు

ఉద్యోగి మృతితో విషాదంలో కుటుంబం

ప్రజాపక్షం/బూర్గంపాడు: అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు అమర్చిన కరెంట్ ఉచ్చుకు అటవీశాఖ ఉద్యోగి బలైన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. బూర్గంపాడు మండలం నకిరేపేట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పాల్వంచ రేంజ్‌కు చెందిన అటవీశాఖ ఉద్యోగి నవీన్ విధుల్లో భాగంగా అటవీ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో వేటగాళ్లు అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ ఉచ్చుకు చిక్కుకున్నట్లు సమాచారం. విద్యుదాఘాతానికి గురై నవీన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. మృతుడు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాజీ ఎంపీపీ బానోతు దేవ్లా నాయక్ చిన్న కుమారుడిగా, వెంకట్యాతండాకు చెందినవారిగా సమాచారం. విధి నిర్వహణలో ఉండగానే నవీన్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అటవీశాఖ సిబ్బందిలో విషాదం నెలకొంది. అడవి జంతువుల వేట కోసం విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది