ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వైరాలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు


 ప్రజాపక్షం/వైరా: వైరా మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు బట్ట కృష్ణ ఫోటోగ్రఫీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సభ్యులకు స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ జాక్ మాండే డాగ్యురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బట్ట కృష్ణ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఆధునిక కెమెరాలు, డిజిటల్ టెక్నాలజీ, నూతన ఎడిటింగ్ విధానాలపై ప్రతి ఫోటోగ్రాఫర్ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. సబ్సిడీపై రుణాలు అందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఫోటోగ్రాఫర్లకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఫోటోగ్రఫీ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. అనంతరం వైరా పట్టణంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఫోటోగ్రఫీ రంగం ప్రాధాన్యతను చాటుతూ నిర్వహించిన ర్యాలీలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎక్కిరాల శ్రీనివాసరావు, వైరా మండల ఫోటోగ్రాఫర్స్ గౌరవ అధ్యక్షుడు ఏపూరి రాజారావు, కార్యదర్శి కాకాటి వినోద్ కుమార్, కోశాధికారి తెల్లపుట్ట ప్రసన్నకుమార్, అసోసియేషన్ నాయకులు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది