ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఘనంగా బోనాల జాతర


 ప్రజాపక్షం – నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం భైరవునిపల్లి గ్రామంలో ఆదివారం బోనాల పండుగను గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలను నెత్తిన ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బోనాల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండపనేని లక్ష్మణరావు,ఉప సర్పంచ్ ఆలేటీ ఉమామహేష్, గ్రామ పెద్దలు కనకబండి సీతారాములు, పోలంపల్లి వెంకట పిచ్చయ్య, మరికంటి రమేష్, కనకబండి కనకనాగరాజు, బాలిన కృష్ణంరాజు, భద్రజీ వేంకటేశ్వరరావు,పెద్దపాక వేంకటేశ్వరరావు, మరికంటి శంకర్, మల్లెబోయిన శ్రీనివాస్ రావు, పెద్దపాక నాగేశ్వరరావు, బుర్ర నాగభూషణం,గండు సైదులు,మల్లెబోయిన గోవిందరావు, కుంచం బిక్షం, కనకబండి రామయ్య, పొదిల లక్ష్మయ్య గ్రామ యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది