ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వార్డు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. కమిషనర్‌కు సమస్యలు వివరించిన సిపిఐ కౌన్సిలర్ దండి రంగారావు


 వార్డు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. కమిషనర్‌కు సమస్యలు వివరించిన సిపిఐ కౌన్సిలర్ దండి రంగారావు

క్షేత్రస్థాయిలో పరిశీలన.. తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో నెలకొన్న ప్రధాన సమస్యలపై సిపిఐ కౌన్సిలర్ దండి రంగారావు చొరవతో మున్సిపల్ కమిషనర్ అల్లా శ్రీనివాస్ రెడ్డి మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా షాబాద్ నగర్ వద్ద ఏర్పాటు చేసిన పైప్‌లైన్ పరిస్థితి, నారా పొంగు బజారుకు వెళ్లే మార్గంలో ప్రమాదకరంగా ఎత్తుగా ఉన్న చిన్న కల్వర్టు, అలాగే ఓ పత్రిక కార్యాలయం సమీపంలోని ఎన్‌ఎస్‌పీ కాలువను కమిషనర్ పరిశీలించారు. అలాగే పలు అభివృద్ధితోపాటు సమస్యలను కమిషనర్ కు వివరించారు. వార్డు అభివృద్ధికి అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను వివరించిన కౌన్సిలర్, పైప్‌లైన్, కల్వర్టు, కాలువ సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని కోరారు. ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన చర్యలు చేపడతామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది