ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఖమ్మం: మర్లపాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఫుడ్ పాయిజన్


 ఉప్మా తిని 8 మంది విద్యార్థులకు వాంతులు.. అస్వస్థత

ప్రజాపక్షం/వేంసూర్ : ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పాఠశాలలో ఉప్మా తిన్న ఎనిమిది మంది విద్యార్థులు వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థులను వేంసూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు గల కారణాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది