ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలించిన అన్ని శాఖల అధికారులు

 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: వినాయక చవితి నిమజ్జనానికి ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ బుధవారం పరిశీలించారు. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్దాల–కామంచికల్లు బ్రిడ్జి వద్ద మున్నేరు నీటి ప్రవాహాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించి, నిమజ్జనానికి అనుకూలమైన ప్రాంతాలను అంచనా వేశారు. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, విద్యుత్, లైటింగ్, తాగునీరు తదితర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నదిలో నీటి ప్రవాహం దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది