ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని మంగళగూడెం గ్రామపంచాయతీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. సర్పంచ్ మేకల సత్యనారాయణ, ఉపసర్పంచ్ కన్నేటి అనిల్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. మంగళగూడెం గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 1,048 స్మార్ట్ రేషన్ కార్డులు అందించాల్సి ఉండగా, ప్రస్తుతం శాంపిల్‌గా 10 కార్డులను మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన 998 కార్డులను త్వరలో లబ్ధిదారులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీపీఓ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి నాగమణి, రేషన్ డీలర్ లింగరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి