ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం


 తల్లి, కొడుకు దుర్మరణం – డ్రైవర్ పరిస్థితి విషమం

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గ్రీన్ఫీల్డ్ హైవేపై గురువారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దంసలాపురం సమీపంలోని మున్నేరు వంతెన వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురికావడంతో తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, అతడిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం మేరకు, మృతులు ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు అధికారికంగా వారి వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనతో గ్రీన్ఫీల్డ్ హైవేపై తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది