ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రూ.1.20 లక్షలు పలికిన వినాయకుడి లడ్డూ..!


 

400 జనాభా ఉన్న చిన్న గ్రామంలో భారీ ధరకు లడ్డూ వేలం

సమూహంగా వేలంలో దక్కించుకున్న ఐదుగురు గ్రామస్థులు

ప్రజాపక్షం/నేలకొండపల్లి: వినాయకుడి లడ్డూకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. మండలంలోని రాజారాంపేట గ్రామంలో శనివారం నిర్వహించిన లడ్డూ వేలం పాటలో రూ.1,20,116 ధర పలికింది. గ్రామానికి చెందిన కుండా నారాయణ, ముక్కిరాల రామయ్య, వెన్నబోయిన నాగేశ్వరరావు, బండ్ల నాగయ్య, బొల్లా పెద్ద వెంకటి సమూహంగా పాల్గొని ఈ లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. వినాయక విగ్రహ నిమజ్జనం సందర్భంగా మండపం వద్ద లడ్డూ వేలం పాట నిర్వహించారు. పంచాయతీ సర్పంచ్ రాయపూడి రామారావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. వేలం పాటలో గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొనగా.. చివరకు రూ.1,20,116కు లడ్డూను ఐదుగురు కలిసి సొంతం చేసుకున్నారు. అనంతరం వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని కోలాటాలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ వీధుల్లో భక్తుల సందడి నెలకొంది. మండలంలోనే అతి చిన్న గ్రామాల్లో ఒకటైన రాజారాంపేటలో సుమారు 400 మంది జనాభా ఉండగా.. వినాయకుడి లడ్డూ ఏకంగా రూ.1.20 లక్షలకు పైగా పలకడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చిన్న గ్రామంలో భారీ మొత్తానికి లడ్డూ వేలం జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది