ప్రజాపక్షం/నేలకొండపల్లి: మండలంలోని భైరవునిపల్లి గ్రామానికి చెందిన మల్లెబోయిన ఉపేందర్ కు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. గురువారం యాదగిరిగుట్టలో నిర్వహించిన ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల్లో ఉపేందర్‌ను రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామస్థాయి నుంచి యువజన ఉద్యమంలో చురుకుగా పనిచేస్తూ మండల, జిల్లా స్థాయిలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపేందర్‌కు రాష్ట్ర కమిటీలో చోటు దక్కడం నేలకొండపల్లి మండల యువజన ఉద్యమానికి దక్కిన గౌరవంగా పలువురు నాయకులు కొనియాడారు. యువత సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఏఐవైఎఫ్‌ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఉపేందర్ ఎన్నిక పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కర్నాటి భాను ప్రసాద్, కనకబండి సీతారాములు, మండల కార్యదర్శి మారిశెట్టి వేంకటేశ్వరరావుతో పాటు పలువురు సీపీఐ నాయకులు, ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. యువజన ఉద్యమంలో మరింత క్రియాశీలంగా పనిచేస్తూ నిరుద్యోగం, డ్రగ్స్ నియంత్రణ, విద్య, ఉపాధి తదితర సమస్యలపై యువత తరఫున పోరాటాలను ఉధృతం చేయాలని వారు ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి