ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా పార్టీ కార్యాలయం



  మంచికంటి రాంకిషన్ రావు ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దాం

  రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు       

   కాచిరాజుగూడెంలో సిపిఐ(ఎం) పార్టీ కార్యాలయ భవన శంకుస్థాపన 

ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీ నూతన కార్యాలయం అమరజీవి చల్లపల్లి సీతమ్మ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు,జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు,పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ శాఖా కార్యదర్శి పొన్నం భాస్కర్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ సిపిఎం పార్టీ నూతన కార్యాలయం కేవలం ఒక భవనం మాత్రమే కాదని, ప్రజా సమస్యలపై పోరాటాలకు, పేదలు, కార్మికులు, రైతుల గొంతుకగా నిలిచే ఉద్యమ కేంద్రంగా ఉండాలని అన్నారు.పార్టీ కార్యాలయ భవనానికి స్థలం ఇచ్చిన అమరజీవి చల్లపల్లి సీతమ్మ పేరు కాచిరాజుగూడెం గ్రామం ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు.రోడ్డు పక్కన ఇంత విలువైన స్థలాన్ని పార్టీకి విరాళంగా దానం చేయడం నిజమైన కమ్యూనిస్టు యోధులకే సాధ్యం అని కొనియాడారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మంచికంటి రాంకిషన్ రావు ఆశయాలు, ఉద్యమ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు. ఆయన చూపిన ప్రజా సేవా మార్గంలో నడుస్తూ గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.  పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రతి కార్యకర్త, అభిమాని, ప్రజల సహకారంతోనే పూర్తి అవుతుందని తెలిపారు. భవన నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు భాగస్వామ్యం అందించి ఉద్యమ కేంద్రాన్ని బలోపేతం చేయాలని కోరారు.  ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ, రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు, సామాన్య ప్రజల హక్కుల కోసం సీపీఐ(ఎం) పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కే.నర్సయ్య, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నండ్ర ప్రసాద్,షేక్ బషీరుద్దీన్, రూరల్ మండల కార్యదర్శి వడ్లమూడి నాగేశ్వరరావు,ప్రజా నాట్య మండలి పాలేరు డివిజన్ కార్యదర్శి నందిగామ కృష్ణ,   డివిజన్ కమిటి సభ్యులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, మండల నాయకులు పొన్నం వెంకటరమణ, భూక్యా నాగేశ్వరరావు, పొన్నం మురళి, కారుమంచి గురవయ్య, అద్దంకి తిరుమలయ్య, అద్దంకి వేలాద్రి, ఏలూరి నాగేశ్వరావు,లెనిన్ శ్రీనివాస్, యడ్లపల్లి వెంకట్రామయ్య, పుచ్చకాయల. నాగేశ్వరరావు,షైక్ సైదులు, ఎం.వెంకటాయపాలెం సర్పంచ్ వేగినాటి విజయ్ కుమార్, కాచిరాజు గూడెం సర్పంచ్ మాలోత్ హరి,ఆరేకోడు గ్రామ సర్పంచ్ ఆరెంపుల రమాదేవి,సిపిఐ నాయకులు ఏలూరి భాస్కర్ రావు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది