ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌లో మల్లెమడుగు విద్యార్థినులకు కాంస్య పతకాలు



 

పీడీ కృష్ణయ్యకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: నిజామాబాద్‌లో సెప్టెంబర్‌ 4 నుంచి 6 వరకు నిర్వహించిన జూనియర్స్‌ అండర్‌-16 బాలికల రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు కాంస్య పతకం సాధించింది. ఈ జట్టులో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మల్లెమడుగుకు చెందిన ఐదుగురు విద్యార్థినులు కె. అనిత, టీ. నవ్యశ్రీ, ఏ. వెన్నెల, ఎస్‌కే. నసీమ, వి. పల్లవి పాల్గొని ప్రతిభ కనబరిచారు.ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె. సాంబమూర్తి, పీడీ బియ్యని కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఇండస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 6న నిర్వహించిన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు పాఠశాల పీడీ బియ్యని కృష్ణయ్య ఎంపికై అవార్డును అందుకున్నారు. క్రీడారంగంలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ జాతీయ, రాష్ట్రస్థాయిలో విజయాలు సాధించేలా కృష్ణయ్య చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. కృష్ణయ్య శిక్షణలో విద్యార్థులు ఖో-ఖో, ఫుట్‌బాల్‌ విభాగాల్లో జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఖో-ఖోలో చంద్రిక జాతీయస్థాయికి ఎంపిక కాగా, ఫుట్‌బాల్‌లో యువవర్షిణి జాతీయస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో విద్యార్థులు రెండు బంగారు, నాలుగు వెండి, 11 కాంస్య పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఇదే పాఠశాలకు చెందిన కె. అనిత గతంలో రాష్ట్రస్థాయి సీఎం కప్‌ ఫుట్‌బాల్‌లో బంగారు పతకం, సబ్‌-జూనియర్స్‌లో వెండి పతకం సాధించగా, ఈ ఏడాది జూనియర్స్‌ విభాగంలో రెండు కాంస్య పతకాలు సాధించింది. టీ. నవ్యశ్రీ గత ఏడాది రాష్ట్రస్థాయి సబ్‌-జూనియర్‌ ఫుట్‌బాల్‌లో వెండి పతకం సాధించగా, ఈ ఏడాది జూనియర్స్‌ విభాగంలో కాంస్య పతకం సాధించింది. విద్యార్థినుల విజయాలతో పాటు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న పీడీ కృష్ణయ్యను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాంబమూర్తి, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు అలివేణి, గ్రామ పెద్దలు నూకారపు వెంకటేశ్వరరావు, భోజర్ల సూర్యం, పీట్ల కృష్ణమూర్తి, కృష్ణ, మనోజ్‌, సైదులు, మాజీ కార్పొరేటర్లు నిరంజన్‌కుమార్‌, లలితారాణి, జానీమియా, బట్టపోతుల సతీష్‌, పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణవేణి, శారద, హేమలత, సుధాకర్‌, స్వర్ణలత, బ్రహ్మచారి, దేవమనమ్మ, వెంకటేశ్వర్లు, అరుణ, సుజాత, బలమని, సహదేవ్‌, రాజకుమారి, నవీన్‌, ఉపేందర్‌ తదితరులు అభినందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది