తండ్రి మృతి.. చిన్నారుల పరిస్థితి విషమం
ప్రజాపక్షం / నేలకొండపల్లి :
నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం గ్రామంలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు (44) గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకుముందు తన కుమారుడు (14), కుమార్తె నిఖిల్ (10)కు కూడా అదే విషపదార్థాన్ని తాగించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు. అయితే శ్రీనివాసరావు అప్పటికే మృతిచెందగా, ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కుటుంబ కలహాలే కారణమా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి