ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా మహంకాళి వీరబాబు, ఎం ఎస్ పి మండల అధ్యక్షుడిగా సిరిపురం బొందయ్య
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన మండల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా ఇన్చార్జి కందికట్ల విజయ్, ఎంఎస్పీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు తురుగంటి అంజయ్య మాదిగ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీల ఎన్నిక నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడిగా మహంకాళి వీరబాబు మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షుడిగా సిరిపురం బొందయ్య మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మండల స్థాయిలో సంఘాలను మరింత బలోపేతం చేస్తూ మాదిగల హక్కులు, సామాజిక న్యాయం, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి సంఘటిత శక్తిని బలోపేతం చేసి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులను నాయకులు, కార్యకర్తలు అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ఎం,ఎస్పీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి