ప్రజా పక్షం/ వైరా: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు వనమా విశ్వేశ్వరరావు జన్మదిన వేడుకలను వైరాలో ఘనంగా నిర్వహించారు. వైరా మండల, పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా విశ్వేశ్వరరావు, మణికుమారి దంపతులకు పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన వస్త్రాలను బహూకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యాపారులు, వాసవి యూత్ సభ్యులు, నాయకులు, మండల, పట్టణ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు పాల్గొని వనమా విశ్వేశ్వరరావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి