ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

సాగర్ జలాలతో రైతులను ఆదుకోవాలి


 మండలంలోని కుంటలు, చెరువులను తక్షణమే నింపాలి

ఫసల్ బీమా అమలు చేయాలి: బీజేపీ

ప్రజాపక్షం / నేలకొండపల్లి: సాగర్ జలాలను విడుదల చేసి రైతులను ఆదుకోవడంతో పాటు నేలకొండపల్లి మండలంలోని అన్ని కుంటలు, చెరువులను తక్షణమే నీటితో నింపాలని బీజేపీ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం బీజేపీ నేలకొండపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌పీ ఏఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేలకొండపల్లి మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం పేరుతో సాగర్ జలాలను విడుదల చేయకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. మండలంలోని రైతాంగానికి సాగునీరు అందించేందుకు సాగర్ జలాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. కుంటలు, చెరువులను నింపి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్తులో చేపట్టే ఆందోళనలకు బీజేపీ నాయకత్వం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు అనంత ఉపేందర్ గౌడ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు మల్లెబోయిన గోవిందరావు, బాజా రామకృష్ణ, నాయకులు పురాణం దివాకర్, పిట్టల సూరిబాబు, ఎస్కే షరీఫుద్దీన్, కిసాన్ మోర్చా మండల కన్వీనర్ సూరేపల్లి జ్ఞానరత్నం, గెల్లా చక్రపాణి, తుపాకుల సంజన, కొండ హర్షవర్ధన్, ధారావత్ వీరు నాయక్, సోషల్ మీడియా ఇన్‌చార్జి కే.గోపి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది