నేనున్నా మహిళా మండలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
ప్రజాపక్షం/వైరా : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ జన్మదిన వేడుకలను గరికపాడులోని నేనున్నా మహిళా మండలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు మిఠాయిలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు అందజేశారు. గ్రామ సర్పంచ్ లక్కిరెడ్డి నాగలక్ష్మి ప్రభాకర్ రెడ్డి, మండల వైద్యాధికారి శ్రీహర్ష ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు.సొసైటీ అధ్యక్షురాలు మేరుగు మానస మాట్లాడుతూ.. కలెక్టర్‌గా ఆర్వీ కర్ణన్ గ్రామానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ప్రజల సమస్యలకు ఆయన వెంటనే స్పందించి పరిష్కారాలు చూపించారని, ఆయన సేవా స్ఫూర్తితో ప్రతి ఏటా జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ సురేష్ బాబు, వార్డు మెంబర్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ నిమ్మతోట శిరీష దీప్తిక, ఏఎన్ఎం జ్యోతి, ప్రధానోపాధ్యాయురాలు ఎస్. సరస్వతి, సొసైటీ డైరెక్టర్ మేరుగు రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి