29వ వార్డు శ్రీరామ్ నగర్లో నీటి నిల్వ సమస్యపై తక్షణ చర్యలు
చైర్పర్సన్ స్పందనకు కాలనీవాసుల కృతజ్ఞతలు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ 29వ వార్డు పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ రోడ్ నంబర్ 13లో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని కాలనీవాసులు వాట్సాప్ ద్వారా చైర్పర్సన్ పొకబత్తిని అనిత దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్ వెంపటి ఉమా వెంకటేశ్వర్లుతో కలిసి క్షేత్రస్థాయికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని, ప్రజల రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించారు. నీటి నిల్వకు గల కారణాలను గుర్తించి, వర్షపు నీరు సులభంగా వెళ్లేలా అవసరమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. వర్షాల సమయంలో నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా సంబంధిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంతో పాటు తన దృష్టికి తీసుకొస్తే సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ అనిత పేర్కొన్నారు. సమస్యను వాట్సాప్ ద్వారా తెలియజేసిన వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించినందుకు కాలనీవాసులు చైర్‌పర్సన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బానోత్ దివ్య, బుర్ర మహేష్, బానోత్ ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, శ్రీరామ్ నగర్ కాలనీవాసులు వసీం, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి