ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఒక్కరి సమాచారంతో.. భారీ గంజాయి గుట్టురట్టు!


 

బైక్‌లో 9 కిలోలు.. కారులో 100 కిలోలు.. లారీలో 263.2 కిలోలు

ప్రజాపక్షం/ఖమ్మం/ ఖమ్మం రూరల్ రూరల్: ఓ సాధారణ వాహన తనిఖీ.. ఓ బైక్‌లో 9 కిలోల గంజాయి పట్టుబడటం.. ఆ తర్వాత నిందితుడిని విచారించడంతో మరో కారు జాడ లభించడం.. అందులో ఏకంగా 100 కిలోల గంజాయి బయటపడటం.. ఆ ఇద్దరి నుంచి లభించిన సమాచారంతో మరో లారీని తనిఖీ చేయగా 263.2 కిలోల గంజాయి పట్టుబడటం.. ఇలా ఒకరి తర్వాత మరొకరి నుంచి లభించిన సమాచారంతో ఎక్సైజ్‌ అధికారులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం, ఖమ్మం ఎక్సైజ్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకున్న ఈ వరుస తనిఖీల్లో మొత్తం 372. గంజాయి పట్టుబడింది. దీని విలువ 82 లక్షలు గా అధికారులు గుర్తించారు . నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన అధికారులు గంజాయి తరలింపునకు ఉపయోగించిన లారీ, కారు, బైక్‌తో పాటు ఐదు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు..

బైక్‌ తనిఖీతో మొదలైన వ్యవహారం

భద్రాచలం పరిధిలోని వీరభద్ర ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఎక్సైజ్‌ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో హీరో బైక్‌పై వెళ్తున్న ఒడిశాకు చెందిన దివాకర్‌ మండల్‌ (22)ను తనిఖీ చేయగా 9 కిలోల గంజాయి బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

9 కిలోల నుంచి 100 కిలోలకు..

దివాకర్‌ ఇచ్చిన సమాచారంతో అతడి వెనుక వస్తున్న హ్యుందాయ్‌ వెర్నా కారును ఎక్సైజ్‌ అధికారులు అడ్డుకుని తనిఖీ చేశారు. కారులో 100 కిలోల గంజాయి లభించడంతో సుమన్‌ పాల్‌ (22)ను అరెస్ట్‌ చేశారు. ఇక్కడితో తనిఖీలు ఆగలేదు. ఇద్దరు నిందితుల నుంచి లభించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఖమ్మం ఎక్సైజ్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ అధికారులు తదుపరి వాహనం కోసం గాలింపు చేపట్టారు.

లారీని తనిఖీ చేయగా..

ఖమ్మం-2 ఎక్సైజ్‌ పరిధిలోని కరుణగిరి వద్ద పెట్రోల్‌ బంక్‌ సమీపంలో నిలిపి ఉన్న అశోక్‌ లేలాండ్‌ లారీపై అధికారులకు అనుమానం వచ్చింది. లారీని తనిఖీ చేయగా ట్రాలీలో దాచిన 263.2 కిలోల గంజాయి బయటపడింది. లారీలో ఉన్న డ్రైవర్‌ రాజశేఖర్‌ మాఝీ (22), క్లీనర్‌ బ్రిజన్‌ సానా (20)ను అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ విధంగా తొలుత పట్టుబడిన 9 కిలోల గంజాయి కేసులో నిందితుడి నుంచి లభించిన సమాచారం ఆధారంగా తదుపరి కారును, ఆ తర్వాత లారీని గుర్తించి తనిఖీ చేయడంతో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడినట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది