ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వర్షంలో తడుస్తూ.. వెలుగులు నిలిపిన అధికారి!


 నిమజ్జన వేళ విద్యుత్ అంతరాయం లేకుండా పర్యవేక్షణ..

విద్యుత్ శాఖ అధికారి జి.రవి సేవలకు స్థానికుల ప్రశంసలు

ప్రజాపక్షం / నేలకొండపల్లి: వినాయక నిమజ్జన వేడుకల వేళ బుధవారం భారీ వర్షం కురిసినా.. ప్రజల భద్రతకు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా విద్యుత్ శాఖ అధికారి జి.రవి స్వయంగా రంగంలోకి దిగారు. వర్షంలో తడుస్తూనే సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యుత్ లైన్లను పరిశీలించి, తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నిమజ్జన ఘాట్ పరిసరాల్లో పలుచోట్ల విద్యుత్ లైన్లపై చెట్లు పడటంతో అంతరాయం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. అధికారి జి.రవి సైతం వర్షాన్ని లెక్కచేయకుండా సిబ్బందితో కలిసి సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లి లైన్లను తనిఖీ చేశారు. తడిసిన వైర్లు, విద్యుత్ లైన్ల పరిస్థితిని పరిశీలిస్తూ అవసరమైన చోట మరమ్మతులు చేయించారు. నిమజ్జన ఘాట్ వద్ద విద్యుత్ సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. “వర్షం కురిసినా.. విధులకు వెనుకడుగు లేదు” అన్నట్టుగా బుధవారం రాత్రి వరకు క్షేత్రస్థాయిలో ఉండి విద్యుత్ సరఫరాను పర్యవేక్షించిన జి.రవి తీరుపై స్థానికులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రశంసలు కురిపించారు. ప్రజల పండుగ సజావుగా సాగేందుకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన అధికారిని పలువురు అభినందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది