ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

నా ప్రజలు సుభిక్షంగా ఉండాలి...


 

 వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ బండి సతీష్

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సర్పంచ్ బండి సతీష్ తెలిపారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఆరంపుల గ్రామంలోని హనుమాన్ టెంపుల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సతీసమేతంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలపై విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గ్రామంలో శాంతి, సౌభాగ్యం నెలకొనాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ టెంపుల్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది