మాజీ వార్డు మెంబర్ చేరికతో 4వ వార్డులో కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు జలంగం నగర్లో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. సీపీఎం గ్రామశాఖ అధ్యక్షుడిగా పనిచేసిన, మాజీ వార్డు మెంబర్ ఏర్పుల శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువజన నాయకుడు బోయిన సాయి ఆధ్వర్యంలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరావును కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీపీఎం గ్రామశాఖ అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాసరావు కాంగ్రెస్‌లో చేరడం 4వ వార్డు జలంగం నగర్లో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన చేరికతో స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. యువజన నాయకుడు బోయిన సాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమం స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బొర్రా రాజశేఖర్, జిల్లా నాయకులు అజ్మీర అశోక్ నాయక్, తోట చిన్నవెంకట రెడ్డి, కౌన్సిలర్ కడవ నవీన్, వెంపటి రవి, 4వ వార్డు నాయకులు బోయిన సంగయ్య, షేక్ అబ్దుల్, గున్నాల శ్రీనివాస్, మహంకాళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి