ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఘనంగా గంగవరపు విజయ్ 27వ వర్ధంతి వేడుకలు



 


ఖమ్మం రూరల్ మండల సమితి ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని ఎం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన సిపిఐ దివంగత నేత గంగవరపు విజయ్ 27వ వర్ధంతి వేడుకలను మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మండల సమితి ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మౌలానా దండి మాట్లాడుతూ... రజాకారుల ప్రభావం బలంగా ఉండి కమ్యూనిస్టులను ఏరి వేస్తున్న తరుణంలోనూ విజయ్ చూపించిన తెగువ నేటి యువతకు ఆదర్శంగా పేర్కొన్నారు. ఎర్రజెండా చేతబట్టి పేద ప్రజల పక్షాన ఆయన చేసిన సేవలు అజరామరం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం నాయకుడు మెడకంటి చిన్న వెంకటరెడ్డి , సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు సిద్ధినేని కర్ణ కుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బానోతు రామ్మూర్తి, సిపిఐ జిల్లా సమితి సభ్యుడు ఎడ్లపల్లి శంకరయ్య, వీరభద్రం, బుర్ర నాగేశ్వరరావు, ఉన్నం రంగారావు, సిపిఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, 32వ వార్డు కౌన్సిలర్ మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, ఖమ్మం మండల సమితి సభ్యులు ఏలూరి భాస్కర్, బానోతు జగన్, బట్ట బాబు, వెన్నం భాస్కర్ గోకినపల్లి రామ్మూర్తి , ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బూర మనోజ్, ఏఎస్ఎఫ్ సభ్యుడు సాయి, ఏఐవైఎఫ్ జిల్లా నాయకుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది