ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

28వ వార్డులో కొండచిలువ కలకలం.. తక్షణమే స్పందించిన కౌన్సిలర్ దండి



 


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో కొండచిలువ సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. జాతీయ రహదారికి ఆనుకొని కార్ డెక్కర్ షోరూమ్ పక్కన ఉన్న బజారు ప్రాంతంలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న సీపీఐ కౌన్సిలర్ దండి రంగారావు వెంటనే స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించి, అక్కడ పెరిగిన పిచ్చి చెట్లను జేసీబీ సహాయంతో తొలగించే పనులు చేపట్టించారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి చెట్లు, పొదలు పెరిగిపోవడం వల్ల విషసర్పాలు సంచరించే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ ఆల శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన దండి రంగారావు, ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి చెట్లను తొలగించి, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది