కందాల ఉపేందర్‌రెడ్డి పాలేరు ఎమ్మెల్యేగా గెలవాలని మొక్కులు.. ఇద్దరి చిత్రాల ఫ్లెక్సీతో కాలినడకన యాత్ర
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: తెలంగాణలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, పాలేరు నియోజకవర్గం నుంచి కందాల ఉపేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్షిస్తూ ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దతండాకు చెందిన బానోతు వీరన్న స్వామి శబరిమలైలోని అయ్యప్ప సన్నిధిలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 41 రోజుల దీక్ష అనంతరం మాలను తీసే క్రమంలో ఈ సందర్భంగా కేసీఆర్, కందాల ఉపేందర్‌రెడ్డి చిత్రాలతో రూపొందించిన ఫ్లెక్సీని వెంట తీసుకొని వీరన్న స్వామి కాలినడకన ప్రయాణించారు. తమ అభిమాన నాయకులు తిరిగి రాజకీయంగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాజకీయ నాయకులపై తనకున్న అభిమానాన్ని, తన ఆకాంక్షలను ఈ విధంగా వ్యక్తం చేసిన వీరన్న స్వామి అభిమానం ఆసక్తిని కలిగించింది.

KCR CM avvadam kaadhu
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి