ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు మల్లెమడుగు విద్యార్థిని నందిని ఎంపిక


 


ప్రజాపక్షం/ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి సబ్‌జూనియర్ అథ్లెటిక్స్‌ ఎంపికల్లో మల్లెమడుగు పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని జి. నందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నందిని ట్రై అథ్లాన్ విభాగంలో ప్రతిభ కనబరిచి, ఈ నెల 11న ఆసిఫాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె. సాంబమూర్తి, పీఈటీ బియ్యని కృష్ణయ్య తెలిపారు. నందిని గతంలోనూ క్రీడల్లో ప్రతిభ కనబరిచింది. 2025లో ఎస్‌జీఎఫ్‌ అండర్‌-14 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌తో పాటు రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ అథ్లెటిక్స్‌ ట్రై అథ్లాన్‌కు కూడా ఎంపికైనట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన నందినిని, పీఈటీ కృష్ణయ్యను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాంబమూర్తి, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు అలివేణి, గ్రామ పెద్దలు నూకారపు వెంకటేశ్వరరావు, భోజర్ల సూర్యం, పీట్ల కృష్ణమూర్తి, కృష్ణ, బండి మనోజ్, సైదులు, మాజీ కార్పొరేటర్లు నిరంజన్‌కుమార్, లలితారాణి, జానీమియా, బట్టపోతుల సతీష్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్‌లో జాతీయస్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది