ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఘనంగా అంబటి సుబ్బారావు నివాసంలో మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు


 

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేత 


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ 17వ డివిజన్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబటి సుబ్బారావు నివాసంలో బుధవారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి సుబ్బారావు కేక్ కట్ చేసి అక్కడికి వచ్చిన వారికి పంపిణీ చేస్తూ సంబరంగా జరిపారు.ఈ సందర్భంగా అంబటి సుబ్బారావు మాట్లాడుతూ... మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత పాలేరు నియోజకవర్గంతో పాటు ఏదులాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు ముంబరంగ కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన నాయకుడు అంబటి ఈశ్వర్, కాంగ్రెస్ నాయకులు రాజేష్, సప్పిడి ప్రభాకర్, అంబటి ఉపేందర్, అంబటి బ్రదర్స్ పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది