ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

మైసయ్య కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కందాళ పరామర్శ



 


మైసయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ


 ప్రజాపక్షం/కూసుమంచి: కూసుమంచి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, శునక ప్రేమికుడు కనకం మైసయ్య మృతి పట్ల పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మైసయ్య మంగళవారం అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన నేపథ్యంలో గురువారం కూసుమంచిలోని ఆయన నివాసానికి వెళ్లిన కందాళ, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మైసయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మైసయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆసిఫ్ పాషా, జిల్లా నాయకుడు మల్లిడి వెంకన్న, గురువాయిగూడెం సర్పంచ్ బానోత్ బిక్షం నాయక్, గంగాబండ తండా మాజీ సర్పంచ్ బానోతు కిషన్ , దాసరి వెంకన్న మండల నాయకుడు నలగాటి నాగయ్య, వార్డు మెంబర్ చెరుకుపల్లి వీరయ్య, బెల్లంకొండ కిరణ్, బుచ్చిబాబు, వడిత్య బాలకృష్ణ, కనకం యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది